న్యూఢిల్లీ : అన్ని రకాల ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ కార్డ్ సూచించింది. అదే విదంగా ధైర్యంగా, భద్రంగా షాపింగ్ చేయడానికి కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించింది. అంతర్జాతీయ మోసాల అవగాహనా వారోత్సవం సందర్భంగా ఎస్బీఐ కార్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎప్పుడూ అధికారిక బ్రాండ్ వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయమైన మార్కెట్‌ప్లేస్‌లలో మాత్రమే కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించింది.. సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చే నకిలీ వెబ్‌సైట్ల ర్యాండమ్ లింకులు లేదా అటాచ్మెంట్‌లపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. లేదంటే అవి డిజిటల్ మోసాలకు ప్రధాన ద్వారాలుగా ఉపయోగించబడతాయని పేర్కొంది. సెప్టెంబర్ 2025లో ఈ-కామర్స్ మొత్తం విక్రయాల్లో 66.4 శాతం వాటా క్రెడిట్ కార్డులదేనని గుర్తు చేసింది. డిజిటల్ చెల్లింపు పద్ధతుల వినియోగం పెరుగుతున్న తరుణంలో, వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండటం, అందుబాటులో ఉన్న ఆఫర్లు, డీల్స్‌ను తెలివిగా వినియోగించుకోవాలని సూచించింది.



