Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅంచనాలకు మించి..

అంచనాలకు మించి..

- Advertisement -

విజన్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై సాయి సుధాకర్‌ కొమ్మాల పాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్‌ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు ఈసినిమా రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం శుక్రవారం తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ నాయుడు మాట్లాడుతూ,’ఇందులో కామెడీతో పాటు సస్పెన్స్‌, డివోషనల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి.

ఈ చిత్రం మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’ అని అన్నారు. ‘మా ప్రమోషన్‌ కార్యక్రమాలను రాయలసీమ నుంచే ప్రారంభించాం. కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాల్లో ప్రేక్షకుల ఆదరణ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నిన్న నా సొంత ఊరు మదనపల్లిలో, ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో మాకు దక్కిన రెస్పాన్స్‌ మరువలేనిది. మా చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్‌’ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం పక్కా కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మిమ్మల్ని అలరిస్తుంది’ అని నిర్మాత సుధాకర్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -