Thursday, February 5, 2026
E-PAPER
Homeసినిమాఅంతకుమించి..

అంతకుమించి..

- Advertisement -

పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొం దుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ప్రత్యేక విందుగా నిలవడంతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’లో పవన్‌ కళ్యాణ్‌ కనిపించిన తీరు కట్టిపడేసింది. అభిమాని నుంచి దర్శకుడిగా మారిన హరీశ్‌ శంకర్‌.. పవన్‌కళ్యాణ్‌తో రూపొందించిన గత చిత్రం ‘గబ్బర్‌ సింగ్‌’తో ఎంతటి సంచలనాలు సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో అంతకుమించిన సంచలనాలు సష్టించడానికి సిద్ధమవుతున్నారు. శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్‌ కె యస్‌ రవికుమార్‌, ఎల్‌ బి శ్రీరామ్‌, రావు రమేష్‌, రాంకీ, కె జి ఎఫ్‌ అవినాష్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌ యలమంచిలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -