Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని ప్రధాన సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని ఆయన సేవలను కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహనీయులను గౌరవించుకోవడంతో పాటు వారి స్పూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి నిర్మల, వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -