నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం జాన్కంపేట్ లో అమర వీరుడు భగత్ సింగ్ 118వ జయంతిని వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి గ్రామ నాయకులు, యువకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థి సమస్యలు,నిరుద్యోగం, ప్రైవేటీకరణ,ఫీజుల పెంపు,కాంట్రాక్టు విధానాలు ఇవన్నీ కూడా భగత్ సింగ్ కలలు కన్న సమాజానికి విరుద్ధం అన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులలో పోరాట స్ఫూర్తి పెంపొందించాలని, భగత్ సింగ్ ఆలోచనలు, త్యాగాలు నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు.
సమానత్వం, శోషణ నిర్మూలన, విద్య, ఉద్యోగ హక్కుల కోసం భగత్ సింగ్ పోరాటం నేటికీ ప్రేరణనిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడానికి ఐక్యంగా కృషి చేయాలన్నారు. ఆంగ్లేయుల వెన్నులో వణుకు పంటిచిన విప్లవీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.