నవతెలంగాణ-కామారెడ్డి: భారత విద్యార్ధి ఫెడరేషన్ఎ(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ 95 వ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజినీకాంత్, రాష్ట్ర నాయకులు ముదాం అరుణ్ లు మాట్లాడుతూ.. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లు చిన్న వయసులోనే ఉరికంబాన్ని ఈ దేశం కోసం ముద్దాడరని అన్నారు. భగత్ సింగ్‌కి భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోని ముందుకు వెళ్లాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలకు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాహుల్, నితిన్, నవీన్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్‌కి భారత రత్న ఇవ్వాలి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



