- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని ఇటిక్యాల-రేగుంట గ్రామాల మధ్య గల బ్రిడ్జిపై భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైప్‌లైన్ నుంచి నీరు కారడంతో బ్రిడ్జి పైభాగం నీటితో నిండిపోయి జారుగా మారింది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లేందుకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకలు సాగించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎలాంటి మరమ్మత్తుల చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్ లీకేజీని సరిచేసి, రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -



