– పట్టించుకోని భగీరథ అధికారులు..
– గత రెండేళ్లుగా సమస్య పరిష్కరించని భగీరథ అధికారులు
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్ జిపి గ్రామంలో భగీరథ నీరు లీకేజీతో నీరు వృధా అవుతుంది. అదేవిధంగా మైదాపూర్ గ్రామంలో నీరు లేక గ్రామస్తులు నీటి ఎద్దడి గత రెండు మూడేళ్లుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవలసిన విషయం భగీరథ అధికారులు తమకేమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా భగీరథ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో పలు గ్రామాల ప్రజలు అధికారులపై అక్రోశంలో ఉన్నారు.
1) మైబాపూర్ గ్రామంలో..
మైబాపూర్ గ్రామానికి గత దశాబ్ద కాలంగా నీటి సమస్యను ప్రతి వేసవికి మందు తాండవిస్తూ ఉంటుంది. నాటినుండి తాత్కాలికంగా నీటి సరఫరా చేయడం తప్ప శాశ్వతంగా నీటి పరిష్కారం చేపట్టకపోవడంతో గ్రామస్తులు అసహనంగా ఉన్నారు. ప్రస్తుతం వేసవికాలం సమీపిస్తున్నందున గత వారం రోజుల నుండి నీరు లేక వ్యవసాయ భూమిలో నుండి పైపులను వేసుకొని నీటిని గ్రామానికి తెచ్చుకుని అక్కడినుండి తమ ఇండ్లకు నీటిని తరలిస్తున్నారు. ఎంతమంది నాయకులు అధికారులు వచ్చినా గ్రామ సమస్య పరిష్కరించకపోవడంతో ఎక్కడ పడిన గొంగడి అక్కడే ఉందని గ్రామస్తులు అంటున్నారు.
2)జుక్కల్ మండల కేంద్రంలో
జుక్కల్ మండల కేంద్రంలోని వీధులలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని వీధులకు నీటి సరఫరా జరుగుతుంటే ఇంకొన్ని వీధులలో పైప్ లైన్లు పగిలిపోవడంతో నీటి లీకేజీ వలన నీరు వృధా అవుతుందని గల్లి వాసులు తెలిపారు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ కురవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు అంటున్నారు. మై బాపూర్ గ్రామంలో నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జుక్కల్ మండల కేంద్రంలో మురికి కాలువల గుండా నీరు వృధా అవుతుందని కనిపిస్తున్న దృశ్యమే తెలియజేస్తుంది.
ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యాన్ని వదిలి గ్రామీణ ప్రాంత ప్రజలకు వేల కోట్లు ఖర్చుపెట్టి ఇంటింటికి ఫిల్టర్ వాటర్ అందించే మిషన్ భగీరథ పథకం నీరు గారు తొందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అధికారులు ప్రజలకు సేవ చేయకపోతే వీరికి వేల రూపాయల జీతాలు ఇచ్చి వృధా కావడమే తప్ప ప్రజాధనం కూడా వృదా అవుతోందని యువకులు అంటున్నారు. ఇటువంటి మిషన్ భగీరథ అధికారులపై చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులు దృష్టి సరించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.



