Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసంఘ సంస్కరణ ఉద్యమ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ

సంఘ సంస్కరణ ఉద్యమ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ

- Advertisement -

తెలంగాణ సాహిత్య అకాడమి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సంఘ సంస్కరణ ఉద్యమ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ అని తెలంగాణ సాహితి అకాడమి కార్యదర్శి నామోజు బాలచారి తెలిపారు. భాగ్యరెడ్డి వర్మ 137 వ జయంతిని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని ్య అకాడమీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో పుట్టి మాణిక్యాల వలె వెలుగులు విరజిమ్మిన మహనీయులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. అందులో ‘మాదిరి భాగ్యరెడ్డి వర్మ’ ఒకరని తెలిపారు. ఆయన పుట్టింది అతి సామాన్య నిరుపేద కుటుంబంలో అయినప్పటికీ నిరంతర సామాజిక సేవ ద్వారా సంఘంలో సమున్నత స్థానం సంపాదించుకున్న గొప్ప మహనీయుడని కొనియాడారు. ఒకనాటి ‘మాదిరి భాగయ్య’ కాలం మారే కొద్దీ భాగ్యరెడ్డి వర్మగా సమాజంలో ఎలా పిలవబడ్డాడో ఆయన చరిత్ర చదివిన వారికి అర్థమవుతుందని పేర్కొన్నారు. దళిత జనోద్ధారకుడుగా, సంఘసంస్కరణ ఉద్యమ నాయకుడుగా, పత్రికా సంపాదకుడుగా, మంచి వక్తగా, మానవతావాదిగా బహుముఖ ప్రతిభ కలిగిన భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌ నగరంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ సిబ్బందితోపాటు సాహితీవేత్తలు పాల్గొని నివాళులర్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad