Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం పద్మశాలీయుల కుల ఆరాధ్యదైవమైన శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కుల సంఘ భవనల్లో సంఘ సభ్యుల సమక్షంలో భక్త మార్కండేయ మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కుల బాంధవులందరిలో ఐక్యతను, సంఘటిత శక్తిని, అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుటకు సర్వసక్తులు ప్రసాదించాలని మృత్యుంజయుడైన భక్త మార్కండేయుడిని ప్రార్థించారు. అనంతరం సంఘ సభ్యుల కుటుంబీకులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో ఉప్లూర్ ఓం పద్మశాలి మొదటి సంఘంలో జరిగిన వేడుకల్లో జిల్లా పద్మశాలి యువజన విభాగం కార్యదర్శి యెనుగందుల శశిధర్, ఓం పద్మశాలి మొదటి సంఘం అధ్యక్షులు జిందం రమేష్, ఉపాధ్యక్షులు ఎనుగందుల శైలేందర్, కార్యదర్శి జిందం మల్లేష్, కార్యవర్గ సభ్యులు ధ్యావరశెట్టి హనుమాన్లు, మండల సంఘం సభ్యులు జిందం శ్రీనివాస్, నాగుల ప్రసాద్, దైవశెట్టి అంగడి రమేష్, సంఘం మహిళలు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -