హీరో శర్వా నంద్, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఈనెల 14న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నే షనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య నాయికలుగా నటించారు.
చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘భల్లే భల్లే’ విడుదలైంది. ఇది లవ్‌లోని హ్యాపీనెస్‌ని ప్రజెంట్ చేస్తోంది. హరిచరణ్ పాడిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి అందర్నీ ఆకట్టుకునేలా రాశారు.
శర్వా, సాక్షి పాత్రల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ఒక విజువల్ ట్రీట్‌లా వుంది. కేరళలోని పచ్చని ప్రకతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలోని ఫ్రేమ్‌లు, జంట మధ్య వికసిస్తున్న ప్రేమ అద్భుతంగా చూపించాయి.
ప్రతి ఫ్రేమ్ ఈ పాటకు పండుగ వాతావరణాన్ని, చూడ ముచ్చటైన అనుభూతిని అందిస్తాయి. అద్భుతమైన దశ్యాలు, కూల్ మ్యూజిక్, లవ్లీ పెర్ఫార్మెన్స్‌లతో ఈ పాటను ఒక మరపురాని మ్యూజికల్ మూమెంట్‌గా నిలిపాయి. ఈ సాంగ్ ఇన్‌స్టంట్‌గా హిట్ అయ్యింది అని చిత్రయూనిట్ తెలిపింది.
ఈ చిత్రంలో హీరో శ్రీ విష్ణు ఒక ప్రత్యేక పాత్రలో నటించగా, సత్య, సునీల్, సుదర్శన్ ఇతర పాత్రల్లో అలరించనున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు, నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, కథ: భాను బోగవరపు, డైలాగ్స్: నందు సవిరిగాన, డీఓపీ : జ్ఞాన శేఖర్, యువరాజ్, సంగీతం: విశాల్ చంద్ర శేఖర్, సహ నిర్మాత: అజరు సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి.
ప్రేమలోని సంతోషాన్ని తెలిపే ‘భల్లే… భల్లే’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



