- Advertisement -
ఇండియన్‌వెల్స్ ఓపెన్ 2026
ఇండియన్‌వెల్స్ : భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రి (33) ఇండియన్‌వెల్స్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో యూకీ బాంబ్రి సత్తా చాటుతున్నాడు. స్వీడన్ ఆటగాడు ఆండ్రె గోర్సాన్ జతగా 6-3, 7-6తో యూకీ బాంబ్రి క్వార్టర్‌ఫైనల్లో గెలుపొందాడు. అలెగ్జాండర్ ఎర్లార్ (ఆస్ట్రియా), ఆండ్రీయ వవసోరి (ఇటలీ)పై వరుస సెట్లలో 30 నిమిషాల్లో బాంబ్రి జోడీ విజయం సాధించింది. నేడు సెమీస్‌లో ఆర్థర్ (ఫ్రాన్స్), వాలెంటిన్ (మొనాకో)లతో బాంబ్రి జోడీ తలపడనుంది.
- Advertisement -


