నవతెలంగాణ- హైదరాబాద్: ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇటీవల తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దు జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులను భారత బలగాలు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. మావోల కీలక నేత నంబాల కేశవరావు మృతికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్ కు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. అదేవిధంగా జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల స్మారక సభలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారని వారు తెలిపారు. తాము శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపడం లేదని అన్నారు. గత రెండు నెలలుగా సంయమనం పాటించామని, కేంద్ర రాష్ట్ర ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్ కు పిలుపునిస్తున్నామని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ నేడు లేఖను విడుదల చేశారు.
జూన్ 10న భారత్ బంద్..
- Advertisement -
- Advertisement -



