ఢిల్లీ, ఎన్‌సీఆర్, గుజరాత్‌ల్లో క్యాబ్ సేవలు
పైలట్ ఆపరేషన్ సక్సెస్..రెండేండ్లలో దేశవ్యాప్తంగా విస్తరణ
న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా సహకార నేతృత్వంలోని రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ భారత్ ట్యాక్సీని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం ప్రారంభించారు. రెండు నెలలుగా జరిగిన పైలట్ ఆపరేషన్ విజయవంతమైన తరువాత ఈ సర్వీస్‌ను ఢిల్లీ, ఎన్‌సీఆర్, గుజరాత్‌ల్లో అధికారికంగా ప్రారంభించారు. మరో రెండేండ్లలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ భారత్ టాక్సీ ద్వారా కార్లు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనసేవలను ప్రజలు పొందవచ్చు.
దేశంలో ప్రస్తుతం రైడ్-హెయిలింగ్ మార్కెట్లో ఉబెర్, ఓలా, ర్యాపిడో వంటి కొన్ని సంస్థల ఆధిపత్యం నడుస్తోంది. వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఈ భారత్ టాక్సీని తీసుకొచ్చింది. ఎనిమిది ప్రముఖ సంస్థల సహకారంతో ఈ ఫ్లాట్‌ఫామ్‌ను గతేడాది డిసెంబరు 2న ఢిల్లీ, ఎన్‌సీఆర్, గుజరాత్‌ల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా ప్రారంభించారు. పైలట్ ప్రోగ్రామ్‌లోనే మూడు లక్షలకు పైగా డ్రైవర్లు ఈ ఫ్లాట్‌ఫామ్‌లో చేరారు. లక్ష మందికి పైగా వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో ప్రతీరోజూ 10 వేల కంటే ఎక్కువ రైడ్లు జరిగాయి.
భారత్ ట్యాక్సీ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



