గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం
తదుపరి లక్ష్యం 216 గంటలు
కర్నాటకలో రిమోనా రికార్డ్‌ను బ్రేెక్ చేసిన విదుషి దీక్ష
బెంగళూరు : ఇటీవల కర్నాటకకు చెందిన భరతనాట్య కళాకారిణి రెమోనా ఎవీట్ పెరీరా 7 రోజలు వ్యవధిలో 170 గంటల పాటు నృత్యం చేసి ప్రపంచ రికార్డ్‌లో స్థానం సంపాదించింది. ఎక్కువ గంటల పాటు నాట్యం చేసి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. తాజగా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది మంగళూరుకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష. 170 గంటలకుపైగా నిరంతరాయంగా భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు దక్కించింది.
ప్రపంచ రికార్డ్‌లో దీక్షకు స్థానం
విదుషి దీక్ష ఆగస్టు 21 మధ్యాహ్నం 3:30 గంటలకు నాట్యం చేయడం ప్రారంభించింది. తొమ్మిది రోజుల్లో 216 గంటల పాటు నాట్యం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆగస్టు 28 సాయంత్రం 5:30గంటలకు 170 గంటలు మార్క్‌ను దాటిందని నిర్వాహకులు తెలిపారు. మణిపాల్‌కు చెందిన రత్న సంజీవ కళామండలి ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీ వరకు 216 గంటల పాటు నిరంతరాయంగా నృత్యం చేయనుంది విదుషి దీక్ష. విదుషి దీక్ష అసాధారణ ప్రతిభను, పట్టుదలతో సాధించిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆసియా హెడ్ డాక్టర్ మనీశ్ విష్ణోరు అభినందించారు. ఓ చిన్న గ్రామం, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి గొప్ప ఘనతను సాధించిందని తెలిపారు. పట్టుదలతో ప్రపంచ రికార్డ్‌లో చోటు సంపాదించి చరిత్ర సృష్టించిందని అన్నారు. 170 గంటల రికార్డును బ్రేక్ చేసిన దీక్ష ఇప్పుడు 216 గంటల లక్ష్యం దిశగా నృత్యాన్ని కొనసాగిస్తోందన్నారు.
భరతనాట్యం @ 170 గంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES