నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని నాగ్లూర్ గ్రామంలో భారతీయ కిసాన్ సాంగ్ జెండాఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు గొర్రె గంగాధర్ మాట్లాడుతూ.. రైతులు దళారుల చెరలో మోసపోకుండా ఉండాలంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పంట చేతికి వచ్చిన వెంటనే ప్రారంభం కావాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామంలోని రైతులంతా ఐక్యతగా ఉండి తీర్మానం రాసి, వచ్చే 5వ తేదీన ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేయాలని పిలుపునిచ్చారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు కష్టపడితేనే దేశ ప్రజలందరూ కడుపునిండా భోజనం తింటారు” అని ఆయన స్పష్టం చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు లేదా మందులు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి పంటకు రైతులకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు జాదవ్ రమేష్ పటేల్, గ్రామ ఉపాధ్యక్షులు బాల్రెడ్డి, కార్యదర్శి బాలగోల్ల గంగాధర్, అక్కు బై రవీందర్, గొర్రె సాయిలు, చక్రం గడ్డ సాయిలు, భాస్కర్ నారాయణరావు మక్తమానికిరావు, మక్త రాములు, కాట్ మండి రమేష్, గణేష్ రావు, రమేష్ రావు, గొర్రె సాయిలు, చుక్కల రాజు, చుక్కల శంకర్, బొల్లారం రాజు, సాకలి రాజు, చక్రపాణి బసవరాజ్, చుక్కల శేఖర్, మక్త వెంకటరావు ,కంది ఆశయ్య, కంది సాయిరాం, కనుకుల లాలయ్య తదితరులు గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.