Wednesday, August 6, 2025
E-PAPER
Homeబీజినెస్భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.5,948 కోట్ల నికర లాభాలు

భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.5,948 కోట్ల నికర లాభాలు

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 43 శాతం వృద్ధితో రూ.5,948 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,159 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.38,506 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ1లో 28 శాతం పెరిగి రూ.49,463 కోట్లకు చేరింది. కాగా.. పలు ఎజెన్సీలు అంచనా వేసిన రెవెన్యూ కంటె ఎక్కువ సాధించింది. గడిచిన త్రైమాసికంలో ప్రతీ వినియోగదారుడి నుంచి నెలకు సగటు రావడి (ఎఆర్‌పీయూ) రూ.250కి పెరగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.211 ఎఆర్‌పీయూ నమోదయ్యింది. కొత్తగా 9.39 లక్షల వినియోగదారులు జోడించబడ్డారని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -