Tuesday, November 4, 2025
E-PAPER
Homeబీజినెస్భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో 89 శాతం వృద్ధి

భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో 89 శాతం వృద్ధి

- Advertisement -

న్యూఢిల్లీ : దిగ్గజ ప్రయివేటు రంగ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 89 శాతం వృద్ధితో రూ.6,791.7 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,593.2 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.41,473.3 కోట్ల రెవెన్యూ ఆర్జించగా.. గడిచిన క్యూ2లో 25.7 శాతం పెరిగి రూ.52,145.4 కోట్లుగా చోటు చేసుకుంది. భారత వ్యాపార రెవెన్యూ 22.6 శాతంగా వృద్ధితో రూ.38,690 కోట్లుగా నమోదయ్యింది. గడిచిన త్రైమాసికంలో ప్రతీ వినియోగదారుడి నుంచి రాబడి (ఎఆర్‌పియు) రూ.23 పెరిగి రూ.256గా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.233 ఎఆర్‌పియు ఉంది. 15 దేశాల్లో మొత్తం వినియోగదారుల సంఖ్య 62.4 కోట్లకు చేరింది. భారత్‌లో దాదాపు 45 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -