- Advertisement -
హైదరాబాద్ : 2025 డెఫ్ ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి భవాని కెడియా అర్హత సాధించింది. వినికిడి లోపం కలిగిన క్రీడాకారులు పోటీపడే సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్ నవంబర్ 15 నుంచి 26 వరకు జపాన్‌లో టోక్యోలో జరుగుతాయి. 2022 బ్రెజిల్ డెఫ్ ఒలింపిక్స్‌లో పోటీపడిన భవాని.. నిలకడగా రాణిస్తూ మరోసారి భారత టెన్నిస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనుంది. డెవిస్ కప్ విజేత వాసుదేవ రెడ్డి కోచింగ్‌లో సన్నద్ధమవుతున్న భవాని డెఫ్ ఒలింపిక్స్‌కు తెలంగాణ నుంచి అర్హత సాధించిన తొలి అథ్లెట్ కావటం విశేషం.
- Advertisement -