Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సరైన రోడ్లు లేక భీంగల్ విద్యార్థులకు అవస్థలు

సరైన రోడ్లు లేక భీంగల్ విద్యార్థులకు అవస్థలు

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : ప్రభుత్వ కళాశాలకు వెళ్లాలంటే ఆ బురదలో నుంచి నడవాల్సిందే.నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ కళాశాలలకు బురదలో నుంచి నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలో అన్ని ప్రభుత్వ కళాశాలలు ఒకే దగ్గర నిర్మించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఐటిఐ కళాశాల, కొత్తగా ప్రభుత్వ ఆధీనంలో టాటా కంపెనీ వారు నిర్మిస్తున్నటువంటి ఏటీసీ కాలేజ్ భవనం కూడా అక్కడనే నిర్మించారు.కానీ ఆ కళాశాలలకు రోడ్డు వేయడం మరిచారు. కళాశాల విద్యార్థులకు సరైన రోడ్డు మార్గం లేక గత కొన్ని ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయలు వెంచించి కళాశాల భవనాలు నిర్మించారు, కళాశాల ఆవరణలో అన్ని సౌకర్యాలు సమకూర్చినప్పటికీ కళాశాలకు విద్యార్థులు వెల్లేందుకు మాత్రం సరైన రోడ్డు లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే కళాశాలకు వెళ్లే మట్టి మార్గం నీటి గుంతలతో, బురదగా మారి విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కళాశాలకు వచ్చే అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు కళాశాల చేరుకోవాలంటే ఆ బురదలో నుండే గమ్యం ప్రారంభించారు. ఇది విద్యార్థుల్లో విద్యను అభ్యసించాలనే దృఢ నిశ్చయాన్ని తగ్గించేలా ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వారి సమస్యలను పరిష్కారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -