– ఎన్‌టీపీసీ నుంచి రూ.13,500 కోట్ల ఆర్డర్
హైదరాబాద్ : విద్యుత్ ఉత్పత్తి ఉపకరణాల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)కు తెలంగాణలో భారీ ప్రాజెక్టు దక్కింది. పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న 3ఞ800 మెగావాట్ల సామర్థ్యం గల స్టేజ్2 సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఎన్‌టీపీసీ లిమిటెడ్ నుంచి సుమారు రూ.13,500 కోట్ల భారీ ఆర్డర్‌ను పొందింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోటిఫికేషన్ ఆఫ్ అవార్డ్ (ఏఓఏ)ను మార్చి 29న అందుకుంది. ఈ వివరాలను సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించారు. ఈ కాంట్రాక్టులో భాగంగా బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ)ల రూపకల్పన, తయారీ, సరఫరా, స్థాపనతో పాటు సివిల్, స్ట్రక్చరల్ పనులను కూడా భెల్ చేపట్టనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అవార్డు అందిన తేదీ నుంచి 62 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం 2024 అక్టోబర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్‌లో భెల్ విజేతగా నిలిచింది. ఇప్పటికే నవంబర్ 2024లో లభించిన పరిమిత అనుమతితో ప్రాథమిక పనులు ప్రారంభ మవ్వగా.. తాజా తుది నోటిఫికేషన్‌తో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి అమలుకు మార్గం సుగమమైంది. అత్యాధు నిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా అధిక సామర్థ్యం, తక్కువ ఉద్గారాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఈ భారీ ఒప్పందం వల్ల భెట్ ఆర్డర్ బుక్ బలోపేతం అవ్వడమే కాకుండా.. దేశీయ థర్మల్ పవర్ మౌలిక సదుపాయాల రంగంలో ఆ సంస్థ అగ్రగామిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
తెలంగాణలో భెల్‌కు భారీ ప్రాజెక్ట్
- Advertisement -
- Advertisement -



