వృద్దులకు నిత్యావసరాలు అందజేసిన తండ్రి….
ఆచారాలను పాటించేలా జన్మదిన వేడుకలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
పుట్టిన రోజు నిర్వహించుకోవడం అంటే మధ్య రాత్రి కేక్ కట్ చేయడం, మితృలతో మద్యం తాగుతూ కేరింతలు కొట్టడంగా మారిన ఈ రోజుల్లో దానికి భిన్నంగా ఆశీర్వాద ఆచారాలు, పెద్దలను గౌరవించే విధంగా ఒక తనయుడి పుట్టిన రోజు పురస్కరించుకుని ఓ తండ్రి వృద్దులకు నిత్యావసరాలు అందజేయడమే కాకుండా తను చదివిన కళాశాల ప్రిన్సిపాల్ ఆశీర్వాదం పొందేలా సంప్రదాయాల పరిచయం చేసారు.
అశ్వారావుపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖుడు భోగవల్లి రాంబాబు తనయుడు ఆకాశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం తాను విద్యనభ్యసించిన వీకేడీవీఎస్ కళాశాల కు వెళ్ళి ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు ఆశీర్వాదాలు ఇప్పించారు. బోధనా సిబ్బందికి మిఠాయి లను పంపిణీ చేసారు. స్థానిక అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమం లోని వృద్దులకు 25 కేజీల బియ్యం, పండ్లు, మిఠాయిలు అందజేసారు.