– ఇంటి ముంగిట్లో ఆకర్షిస్తున్న రంగురంగుల ముగ్గులు
నవతెలంగాణ-పెద్దవూర : బోగి పండుగను మండలంలోని వెల్మగూడెం,బట్టుగూడెం,పెద్దవూర,చలకుర్తి,పర్వే దుల,పోతునూరు,పులిచర్ల,నాగార్జున సాగర్,నాయిన వాణికుంట,శిరసనగండ్ల,కుంకుడు చెట్టు తండా,ఉట్లపల్లి మండలం లోని అన్నీ గ్రామాల్లో బుధవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులు, ఆడపడుచులు ఉత్సాహంగా పోటాపోటీగా తమ ముంగిట్లో అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి ముంగిట్లో రంగురంగులతో వేసిన ముగ్గులు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.దీంతో పాటు చిన్న, పెద్ద వయస్సు తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేయడం, సందడి చేయటం జరుగుతుంది. తీపి వంటకాలు చేసి బంధుమిత్రులకు సయితం ఆహ్వానిస్తున్నారు. ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతుంది. సంస్కృతి, సాంప్రదాయాలు సైతం పెద్ద వూర మండలంలో కన్పిస్తాయి. మకర సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు అని పెద్దలు అభివర్ణిస్తుంటారు.
పెద్దవూర లో ఘనంగా భోగి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



