నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హసకొత్తూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి, భూమి పూజ నిర్వహించి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ లబ్ధిదారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగేలా ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపిడీ లింగరెడ్డి, కుందేటి శ్రీనివాస్, మోదీనీ శ్రీధర్, మంద భాగ్యలక్ష్మి, కల్లెడ లలిత, కాంగ్రెస్ నాయకులు బుచ్చి మల్లయ్య, పంచాయితీ కార్యదర్శి నర్సయ్య, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదరులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES