నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకొని ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఎన్నారై సెల్ జిల్లా కన్వీనర్ సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, ఎమ్మార్వో శివప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES