నవతెలంగాణ – తొగుట: అన్ని గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ప్రశాంతంగా ముగిసిందని తహసిల్దార్ కే. శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల భూ సమస్యలు పరి ష్కరించేందుకు భూభారతి రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసిందన్నారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో భూభారతి రెవెన్యూ సదరును పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తులను జాగ్ర త్తగా పెట్టమని అన్నారు. గోవర్ధనగిరి గ్రామంలో పిఓటి 53, డిఎస్ పెండింగ్ 4, సర్వే నెంబరు మిస్ అయినవి 23, అప్పిలి పిటిషన్ 9, విస్తీర్ణం సవరణ 6, శివారు జమేదర్ 4, సాదా బైనమా 28, మొత్తం 127 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ కార్య క్రమంలో ఆర్ఐ అశోక్ రాజు, రెవిన్యూ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన భూ భారతి సదస్సులు: తహసిల్దార్
- Advertisement -
- Advertisement -

 
                                    