Tuesday, April 29, 2025
Navatelangana
Homeజిల్లాలురైతుల కోసమే భూభారతి చట్టం 

రైతుల కోసమే భూభారతి చట్టం 

- Advertisement -

• భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం 
• నూతన చట్టంతో గ్రామాల్లోకి అధికారులు 
భూభారతి పై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి
• జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, ధరణి పోర్టల్ లో నెలకొన్న భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం అమలులోకి తెచ్చిందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టం పై అవగాహన సదస్సు తొర్రూరు ఆర్డీవో గణేష్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. సదస్సు ముఖ్య అతిథిగా కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వీరబ్రహ్మచారీ హాజరయ్యారు. కార్యక్రమాన్ని తెలంగాణ గీతం ఆలపించి, పీపీటీ చదివి, చట్టంలోని అంశాలను రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న భూభారతి చట్టం చారిత్రాత్మకమన్నారు. సులభరీతిలో, అత్యంత పారదర్శకంగా ఈ నూతన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో ధరణి వలన భూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదని, కోర్టు ను ఆశ్రయించలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. భూభారతి ఆర్.ఓ.ఆర్ చట్టం- 2025 ద్వారా భూ సమస్యల పరిష్కారానికి వివిధ సెక్షన్లను రూపొందించి, తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో మూడంచెల పరిష్కార మార్గాలను రూపొందించినట్లు తెలిపారు. దీనితో పాటుగా ఉచిత న్యాయ సేవలను సైతం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలన అధికారులను, సర్వేయర్లను నియమించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి మాట్లాడుతూ.. నూతన చట్టంతో రెవిన్యూ రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉంటాయన్నారు. ధరణి కాలంలో న్యాయమైన చిన్న చిన్న వారసత్వ, హద్దుల పంచాయితీలు, పేరు మార్పు, చేర్పులు తదితర భూ సమస్యలను పరిష్కరించే అధికారము రెవెన్యూ అధికారులకు లేదని, కానీ ఈ చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతు యొక్క భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే ల్యాండ్ ఏ.నరసింహ మూర్తి, తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ రామచంద్రయ్య శర్మ, కాంగ్రెస్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, పొడిశెట్టి సైదులు గౌడ్, బానోత్ సీతారాం నాయక్, అనపురం శ్రీనివాస్, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, బోనగిరి లింగమూర్తి, గద్దల ఉప్పలయ్య, యాకయ్య, సంపత్, మురళీధర్, ఎంఈవో లు, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు