భూ రిజిస్ట్రేషన్‌లో
కోట్ల రూపాయలు మాయం
ఇంటర్నెట్ నిర్వాహకునితోపాటు ముగ్గురిని అదుపులోకి
తీసుకున్న జనగామ పోలీసులు
నవతెలంగాణ-జనగామ
యాదగిరిగుట్ట కేంద్రంగా భూభారతి స్లాట్ బుకింగ్ కుంభకోణం బయటపడింది. జనగామ జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి యాప్‌లో భూముల రిజిస్ట్రేషన్ రుసుము చెల్లింపుల్లో పెద్ద మొత్తం మాయమవుతున్న విషయం వెలుగులోకి రావడంతో.. దానిపై కొద్దిరోజుల క్రితం దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తీగలాగితే డొంక కదిలిన మాదిరిగా ఒక్కొక్కటి బయటకు రావడంతో అధికారులు దిమ్మతిరిగి పోయారు. భూ భారతి పోర్టలో చెల్లిస్తున్న డబ్బులు ప్రభుత్వ ట్రెజరీలో జమకాకుండా అర్థంకానీ రీతిలో తెలియకుండా మాయమవుతున్నట్టు గుర్తించారు. బ్యాలెన్స్ షీటÊ చెక్ చేస్తున్న సమయంలో తేడా రావడంతో విచారణకు దిగారు. ఉన్నతాధికారులు.. పోలీసులకు సమాచారం అందించారు. నెల రోజులుగా రిజిస్ట్రేషన్ అయిన విషయాలను పరిశీలించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఒక మీ సేవా కేంద్రం ద్వారా ఒక ప్రయివేటు వెంచర్ డెవలపర్స్ భూమి రిజిస్ట్రేషన్ చలానా రుసుము చెల్లింపు విషయంలో డబ్బుల కోసం ఫోన్ చేస్తున్న విషయం బయటపడింది. వీరి రిజిస్ట్రేషన్ కోసం రూ.1,26,133 చెల్లించాలి. కానీ భూభారతి రిజిస్ట్రేషన్ రుసుము చెల్లింపు యాప్ ఎడిట్ ద్వారా రూ.1261 చెల్లించి మిగిలిన డబ్బులను కాజేసి నట్టుగా గుర్తించారు. దాంతో పోలీసులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారణ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఒక ఇంటర్నెట్ నిర్వాహకుడు ఈ కుంభకోణానికి పాల్పడ్డట్టుగా విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఇంటర్నెట్ నిర్వాహకునితో పాటు మరో ముగ్గురిని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 22 చలానాలను ప్రత్యేక యాప్ ద్వారా ఎడిట్ చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహా రం ఇక్కడితో ఆగకుండా యాదగిరిగుట్ట కేంద్రంగా చేసుకొని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 150 మందికి పైగా ఇంటర్నెట్, మీసేవా నిర్వాహ కులతో కలిసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు సమాచారం. ఆ దిశగా ఉన్నతాధికారులు, డీసీపీ స్థాయి పోలీసు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థా యిలో విచారణ చేస్తు న్నారు. సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేయగా ప్రాధమిక దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
యాదగిరిగుట్ట కేంద్రంగా భూభారతి స్లాట్ బుకింగ్ కుంభకోణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



