- Advertisement -
- – ఎర్రజెండాపై విశ్వాసం ప్రజల్లో నేటికీ తగ్గలేదు
- – అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం
- – జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
- నవతెలంగాణ – భువనగిరి
- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల పురిటి గడ్డ భువనగిరి అని నేటికీ ప్రజలలో ఎర్రజెండాపై విశ్వాసం తగ్గలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి సుందరయ్య భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి విగ్రహావిష్కరణ సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అమరవీరుల ఆత్మీయ సభకు ఎండి జహంగీర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ భువనగిరిలో రెండవ ఆంధ్ర మహాసభలో అతివాదులు మితవాదులు విడిపోయారని తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట ఆనవాళ్లు నేటికీ ఉన్నాయన్నారు ఈ జిల్లాలో భూస్వాములు ఇతర పార్టీల చేతుల్లో పదిమంది హత్యకు గురైనట్టు తెలిపారు. భువనగిరి కేంద్రంగా అనేక ఉద్యమాలు ఈ ప్రాంత పోరాట యోధులు నడిపించారన్నారు వారి ఆశయాలను కొనసాగిస్తామన్నారు. సిపిఎం ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ 2016లో జిల్లా కేంద్రం ఏర్పడ్డ తర్వాత జిల్లా కార్యదర్శిగా యువ నాయకుడు ఎండి జహంగీర్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు ఆయన నాయకత్వంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో అనేక ప్రజాసేవ కార్యక్రమాలు అనునిత్యం నడుస్తున్నాయన్నారు.. తుంపల మల్లారెడ్డి స్మారక భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. ఈ భవనంలో జనరిక్ మందుల షాపు గ్రంథాలయం ఆడిటోరియం నిర్మించుకున్నామన్నారు.తిరందాసు గోపి స్ఫూర్తితో కళాభవనానికి శంకుస్థాపన చేశామన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, కరాటే తో పాటు గ్రంథాలయాన్ని నడిపిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఈ గ్రంథాలయం ఉపయోగపడుతుందన్నారు. అమరవీరుల స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి మాట్లాడుతూ నాడు కమ్యూనిస్టులు బోధించిన విద్య వల్లనే మేము చదువుకున్నామన్నారు. భువనగిరిలో ఉద్యమాల నిర్వహణ కోసం కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కార్యాలయం కోసం భూమిని కొనుగోలు చేసి భవన నిర్మాణం ప్రజల సహకారంతో నిర్మించామన్నారు.
- Advertisement -