పీఎం స్వానిధి గడువు పెంపు
రూ. 12,328 కోట్లతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు
అందులో తెలంగాణలో ఒకటి
సనత్‌నగర్-వాడీల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్లు
రూ. 5,012 కోట్లతో తెలంగాణ-కర్నాటక మధ్య 173 కిలో మీటర్ల కొత్త లైన్లు : కేంద్ర మంత్రివర్గం ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పీఎం స్వనిధి పథకం గడువు 2030 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మూడు గంటల పాటు జరిగిన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని 31 మార్చి 2030 వరకు పొడించారు. మొత్తం బడ్జెట్ రూ. 7,332 కోట్లని పేర్కొంది. ఈ పథకం కింద 1.15 కోట్లకు పైగా స్ట్రీట్ వెండర్లు (వీధి వ్యాపారులు) ప్రయోజనం పొందుతారు. ఇది చిన్న వ్యాపారులను ఆత్మనిర్భర్‌గా మార్చడానికి సహాయపడుతుంది. చిన్న వ్యాపారులకు రుణాలు, ఆర్థిక సహాయం కింద మొదటి రుణం రూ. 15,000, రెండో రుణం రూ. 25,000, మూడో రుణం రూ. 50,000 ఇస్తారు.
పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ-కర్నాటక ఉమ్మడి ప్రాజెక్ట్‌లో భాగంగా తెలంగాణలోని సికింద్రాబాద్ (సనత్ నగర్) – కర్నాటకలోని వాడి మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగల్ ఇచ్చింది. మొత్తం రూ. 5,012 కోట్లతో 173 కిలో మీటర్ల కొత్త లైన్‌కు ఆమోదం తెలిపింది. సనత్ నగర్-వాడి ప్రాజెక్ట్ తెలంగాణ-కర్నాటక రాష్ట్రాల పరిధిలోని సుమారు 3,108 గ్రామాల్లో దాదాపు 47.34 లక్షల జనాభాకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. రాబోయే ఐదేండ్లలో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు రూ. 12,328 కోట్ల ఖర్చుతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కచ్‌లోని దూర ప్రాంతాల కలయిక, పర్యాటకానికి ఊపిరినిచ్చేలా ఈ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. రణ్ ఆఫ్ కచ్, హరప్పా స్థలం ధోలవిరా, కోటేశ్వర్ ఆలయం, నారాయణ సరోవర్, లాఖ్‌పట్ కోటకు రైలు సదుపాయం కల్పించ సంకల్పించారు. దీని ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో 251 లక్షల మానవ పని దినాల ఉపాధి కలుగుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల బొగ్గు, సిమెంట్, స్టీల్, కంటైనర్లు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు పెద్ద మేలు జరుగుతుంది. లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి. పర్యావరణ హితం, సివో 2 ఉద్గారాల నియంత్రణ కలుగుతుంది. కర్నాటక, తెలంగాణ, బీహార్, అస్సాం రాష్ట్రాలకు మల్టీ-ట్రాకింగ్‌తో కనెక్టివిటీ పెంపు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల 13 జిల్లాలు లబ్ది పొందుతాయి. 565 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాల కలయిక జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 360 కోట్ల కిలోల సివో2 తగ్గింపు జరుగుతుంది. ఇది 14 కోట్ల చెట్ల నాటిన దానికి సమానమైన ప్రయోజనం ఇస్తుంది.
కామన్వెల్త్ క్రీడలకు బిడ్‌లు
కామన్వెల్త్ క్రీడలు-2030 (సీడబ్ల్యూజీ) వేలంలో పాల్గొనేందుకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బిడ్ ఆమోదం పొందినట్లయితే.. సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అధికారుల నుంచి అవసరమైన హామీలతో పాటు ఆతిథ్య సహకార ఒప్పందంపై (హెచ్‌సీఏ-హౌస్ట్ కొలాబరేషన్) సంతకం చేయడానికి.. గుజరాత్ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని (గ్రాంట్-ఇన్-ఎయిడ్) మంజూరు చేసేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 72 దేశాలకు చెందిన క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడలలో పాల్గొంటారు. క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడలను నియంత్రించే అధికారులు, పర్యాటకులు, క్రీడలకు సంబంధించిన మీడియా వ్యక్తులు వంటి వారు ఈ భారీ క్రీడా కార్యక్రమానికి హాజరవుతారు. ఇది స్థానిక వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారి ఆదాయాలను పెంచుతుంది.
కామన్వెల్త్ గేమ్స్‌కు బిడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES