Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్బిగ్ అలర్ట్.. రాజీవ్ యువ వికాసానికి బ్రేక్..!

బిగ్ అలర్ట్.. రాజీవ్ యువ వికాసానికి బ్రేక్..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని పూర్తి పరిశీలన తర్వాతే అమలు చేయనున్నట్లు మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ స్కీం అనూహ్యంగా వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో క్యాబినెట్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సన్నద్ధతతో పాటు రాజీవ్ యువ వికాసం పథకంపైనా ప్రధానంగా చర్చ సాగింది.ఈ పథకానికి అంచనాలకు మించిన దరఖాస్తులు రావడంతో, అనర్హులకూ ప్రయోజనాలు చేరే అవకాశం ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.

నిజమైన లబ్ధిదారులకే పథకం ప్రయోజనాలు అందాలి అని వారు స్పష్టం చేశారు. ఒక్క అనర్హుడికైనా ప్రయోజనం కలిగితే పథకం లక్ష్యం వంకర అవుతుంది అనే ఆందోళనను వారు సీఎంకు వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత లోతైన పరిశీలన అవసరమని, స్పష్టత కోసం రానున్న కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించాలి అని మంత్రులు సూచించారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మిగతా మంత్రులకు వివరించారు. దీనిపై క్యాబినెట్లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad