- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈనెల 23వ తేదీన విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఆ రోజున విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి వామపక్ష విద్యార్థి సంఘాలు. ప్రభుత్వ స్కూల్లో అలాగే జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రవేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అంశాల నేపథ్యంలో ఈ బంద్ కు పిలుపునిస్తున్నాయి వామపక్ష విద్యార్థి సంఘాలు.
విద్యాశాఖ మంత్రి నియామకం, ఖాళీగా ఆ పోస్టుల భర్తీ అలాగే పెండింగ్ స్కాలర్షిప్ ల విడుదల, ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు, ఇంటర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు లాంటి డిమాండ్లను.. వినిపిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.
- Advertisement -