- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మంత్రి సురేఖ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీలోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
- Advertisement -



