నవతెలంగాణ – భైంసా: ముదిరాజ్ ల సంక్షేమానికి తన వంతుగా పాటుపడతానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. గురువారం భైంసా మండలం లోని కామోల్ గ్రామం లో రూ.12 లక్షలతో నిధులతో నిర్మించనున్న పెద్దమ్మ తల్లి ఆలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దశలవారీగా ఆలయాన్ని అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. కామోల్, కుంసర గ్రామాల మధ్యలో ఆలయం నిర్మించడంతో భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని రైతులంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు మన సమస్యలను దృష్టికి తీసుకురాగా, సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ముదిరాజ్ ల సంక్షేమానికి పెద్ద పీట: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES