Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దనమా...? కులమా...? అనే వ్యాఖ్యలు సరికావు.!

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దనమా…? కులమా…? అనే వ్యాఖ్యలు సరికావు.!

- Advertisement -
  • – ఖండించిన కాంగ్రెస్ ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్
    నవతెలంగాణ – మల్హర్ రావు

పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ సరస్వతి పుష్కరాల్లో కులమా..? దనమా.? అంటూ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని, ధనం కన్నా కులం గొప్పది అందుకే నాపై వివక్ష చూపారని మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కుల వివక్ష చూపుతున్నదెవరూ, దానిని అండ్వంటైజ్ గా తీసుకుంటున్నదెరో చెప్పాలన్నారు.పెద్దపల్లి నుండి మూడు సార్లు ఎంపీగా గెలిచి, జాతీయ రాజకీయాల్లో బ్రాండ్ క్రియేట్ చేసిన కాకాది ఏ కులమన్నారు.కార్మిక నాయకునిగా ఎదిగిన కాకాని అన్ని సామాజిక వర్గాల వారు ఆదరించిన చరిత్ర మరవకూడదన్నారు.వెంకటస్వామిని కాకాని కేవలం ఆ సామాజిక వర్గం వారే పిలుచుకోలేదని, అన్ని వర్గాల వారు పిలుస్తున్నట్టుగా గుర్తు చేశారు.2009లో పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వివేక్ పోటీ చేసినప్పుడు ఏ సామాజిక వర్గాలు వెన్నుదన్నుగా నిలిచాయే చెప్పాలన్నారు.2019 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వివేక్ టికెట్ ఇవ్వకుంటే నిలదీసించిది ఏ సామాజిక వర్గాల్లో తెలియదని ప్రశ్నించారు. 2024 లోకసభ ఎన్నికల్లో వంశీ కృష్ణ అభ్యర్థిత్వంపై సమాలోచనలు చేసి ఏఢు సెగ్మెంట్ల వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయనకు అండగా నిలబడింది ఎవరో తెలియదాని గుర్తు చేశారు.ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా కాకా కుటుంబం ఎదిగిన నేపథ్యంలో.ఆ పరిశ్రమల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన,ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు, అందులో వారి సామాజిక వర్గం వారికి కెటాయించిన వాటా ఎంతో చెప్పాలన్నారు.మొన్నటికి మొన్న సోలార్ ప్లాంట్ ఒడిషాలో ఏర్పాటు చేశారు కానీ తెలంగాణాలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు.అక్కడ బీజేపీ ప్రభుత్వానికి గతంలో ఉన్న  బీజూ సర్కార్ పెద్దలతో వివేక్ కుటుంబానికి ఉన్న అనుబంధం ఏంటన్నారు. పెద్దపల్లి గెలిస్తే తెలంగాణలో అది పెద్దపల్లి లోక్ సభలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ప్రగల్బాలు పలికిన మాట గుర్తు లేదన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad