- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రేపు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం పాట్నాలో జరగనున్న ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. ఈసారి సీఎం పదవి బీజేపీకి దక్కనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ముందంజలో ఉన్నప్పటికీ, ఇతర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కొత్త సీఎంని ప్రకటించిన వెంటనే బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం జరగనుంది.
- Advertisement -



