Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ ఎన్నిక‌లు: 53.77 శాతం పోలింగ్ న‌మోదు

బీహార్ ఎన్నిక‌లు: 53.77 శాతం పోలింగ్ న‌మోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటూ ప్రముఖులూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 53.77 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ (గురువారం) పోలింగ్‌ జరుగుతోంది. ఈ నెల 11న మిగితా 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 14న ఫలితాలను వెల్లడించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -