– జీఎస్టీ సంస్కరణలపై పి. చిదంబరం వ్యాఖ్య
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు స్వాగతించదగినవే. కానీ చాలా ఆలస్యంగా చేపట్టినట్లు కేంద్ర మాజీఆర్థికమంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికలు, ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు చేపట్టినట్లు తెలుస్తుందని చిదంబరం అన్నారు. బుధవారం ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం పాదరక్షలు, దుస్తులపై జిఎస్‌టి రేటును 5 శాతానికి తగ్గించడానికి ఆమోదం తెలిపింది. అలాగే రెండు పన్ను రేట్లు 5 శాతం,18 శాతం శ్లాబులకే ఎక్కువ వస్తువులను తేవాలని, 12 శాతం, 28 శాతం శ్లాబులను తొలగించాలని ఈ కౌన్సిల్ ప్రతిపాదించింది. జీఎస్టీ శ్లాబులను తగ్గించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్వాగతించారు. కానీ ఎన్డీఏ సర్కార్ చేపట్టిన నెక్ట్స్ – జెన్ పేరిట తేబోతున్న జీఎస్టీ సంస్కరణలు చాలా ఆలస్యమయ్యాయని ఆయన అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 8 సంవత్సరాలు ఆలస్యంగా ఈ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా, ‘గత ఎనిమిది సంవత్సరాల జీఎస్టీ రూపకల్పపై వ్యతిరేకిస్తున్నాము. జీఎస్టీపై మేము ఎంత అరిచి చెప్పినా.. ప్రయోజనం లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మార్పులు చేపట్టడమే ఆశ్చర్యంగా ఉంది. వృద్ధి మందగించడం? గృహవినియోగదారుల రుణం పెరగడం? వారి పొదుపు తగ్గడం? బీహర్‌లో ఎన్నికలు? ట్రంప్ టారిఫ్‌లు ఇన్నింటి నేపథ్యంలో జీఎస్టీ సంస్కరణలు తెస్తున్నట్టు అర్థమౌతుందని చిదరంబరం పేర్కొన్నారు.
బీహార్ ఎన్నికలు, ట్రంప్ టారిఫ్‌ల ప్రభావమే
- Advertisement -
- Advertisement -