Sunday, July 6, 2025
E-PAPER
Homeజాతీయంగందరగోళంగా బీహార్‌ ఓటర్‌ జాబితా సవరణ

గందరగోళంగా బీహార్‌ ఓటర్‌ జాబితా సవరణ

- Advertisement -

ఎన్నికల కమిషన్‌ రివిజన్‌లో అనేక లోపాలు
ఈసీ నిర్ణయంపై ప్రతిపక్షాల ఆందోళన
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాజా పరిణామం
పాట్నా :
బీహార్‌ ఓటర్‌ జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ సామర్థ్యం గురించి ఎన్నికల కమిషన్‌ ( ఈసీ) భరోసానిచ్చింది. అయితే ఇది సాధారణ ఓటర్లను గందరగోళంలో పడేసింది. ఎన్నికలకు నిర్వహణకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్న నేపధ్యంలో ఈసీ దీన్ని వేగవంతం చేయడంతో అయోమయం నెలకొందనీ, ఆచరణలో సాధ్యంకాదని ప్రతిపక్షాలు ఆందోళనవ్యక్తం చేస్తున్నాయి..
సరైన సమయం కాదా |
బీహార్‌ వరద ప్రబావిత ప్రాంతం. సీజన్‌ ప్రారంబంలోనే ముమ్మరంగా వర్షాలు పడుతున్నాయి. హడావిడిగా తయారు చేసిన షెడ్యూల్‌ వల్ల , వరదలతో ఇబ్బంది పడే ఈ సమయంలో ఇలాంటి రివిజన్‌ చేపట్టడం సరైనది కాదని, సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తుందని, కార్యకర్తలు ఒత్తిడికి గురౌవుతారని రాజకీయ పక్షాలు వాపోతున్నాయి. అదే సమయంలో వీటిలో తప్పులుదొర్లితే రాజకీయంగా భారీ నష్టం కలుగుతుందని, దానికి ఎవరు భాద్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
అనేక సమస్యలు
బూత్‌ లెవల్‌ అధికారి ( బీఎల్‌ఓ ) ప్రతి ఓటర్‌ ఇంటికి చాలాసార్లు వెళ్లాల్సి ఉంటుంది. ఖాళీ ఫారం ఇవ్వడానికి, తర్వాత దానికి సరైన పత్రాలు జతచేయడానికి, అవి ధృవీకరించుకోవడానికి, కేస్‌ టూ కేస్‌ పరిశీలించడానికి పలుమార్లు తిరగాల్సి ఉంటుంది. మరోవైపు బిహార్లో డాక్యుమెంటేషన్‌ సరిగ్గా లేనందున పత్రాలు సేకరించడం అత్యంత కష్టం. ఇక ఓటర్‌ తన ఫారం, పత్రాలను బీఎల్‌ఓకు ఇవ్వలేకపోతే, వారిని కొత్త ఓటర్‌ జాబితాలో చేర్చరు. బీఎల్‌ఓలు దాదాపు 7 కోట్ల ఓటర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను వారంలోనే సేకరించి, వెరిఫై చేసి, సర్టిఫై చేసి, స్కాన్‌ చేసి అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తైన తరువాత ఆగస్టు 1న డ్రాఫ్ట్‌ రోల్‌ ప్రచురించి, అభ్యంతరాలు, ఫిర్యాదులకు ఒక నెల సమయం ఇస్తారు. బీహార్‌లో వలస కార్మికులు ఎక్కువ. తమ జీవనోపాధికోసం రాష్ట్రాలు దాటి వెళ్తారు. వారు తమ పనిని వదిలి ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో పని మానుకుని జూలైలో బీఎల్‌ఓల కోసం స్వస్థలాలకు చేరుకోవాలి. వారిని తొలగిస్తే ఆగస్టులో మళ్లీ అందుబాటులో ఉండాలి. ఇది ఆచరణలో ఎలా సాధ్యపడుతుందని, ఇన్ని ప్రతిబంధకాల మధ్య సెప్టెంబర్‌ 30 లోపు తుది ఓటర్ల జాబితా సిద్ధం కాగలదా అని, ఈసీ నిర్ణయం సమస్యలను పరిష్కరించక పోగా మరింత జటిలం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -