Magazines

నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రత్యేక దృష్టి... సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2026లో దక్షిణ భారత స్టోరీ టెల్లింగ్‌కు  ఆదరణ

5 గంటల క్రితం

CII Big Picture Summit 202
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2026లో నెట్‌ఫ్లిక్స్ ఇండియా నిర్వహించిన "ఇంటు ది సౌత్‌వర్స్" సెషన్‌లో దక్షిణ భారత కథలకు ప్రాంతీయ సరిహద్దులు దాటి లభిస్తున్న ఆదరణపై చర్చించారు. మోనికా షెర్గిల్ మాట్లాడుతూ, భాషా భేదాలు చెరిగిపోవడంతో ఈ ఏడాది 60 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఇండియన్ టైటిల్స్ గ్లోబల్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయని, ఈ నెల చివర్లో ఒక్కరోజే ఐదు సౌత్ సినిమాలు విడుదలవుతున్నాయని తెలిపారు. సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ, ఒరిజినల్ మార్కెట్లకు మించి ప్రపంచ ప్రేక్షకులను చేరుకోవడంలో నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దర్శకుడు ఎలన్ మాట్లాడుతూ, తమిళ సినిమాలోని సంగీతం, భావోద్వేగాలు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. నటుడు అర్జున్ దాస్ మాట్లాడుతూ, మన సంస్కృతి, భావోద్వేగాల్లో వేళ్లూనుకున్న మన కథలకు దేశవ్యాప్తంగా అపారమైన ఆదరణ లభిస్తోందని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్