Magazines

హిందుస్థాన్‌ జింక్‌ రికార్డు లాభాలు

1 గంట క్రితం

HZL
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణఉదయ్‌పూర్‌: ప్రపంచంలోనే అతిపెద్ద జింక్‌ ఉత్పత్తిదారులలో ఒకటైన హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌, 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆర్థిక ఫలితాలను సాధించింది. కంపెనీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 77 శాతం పెరిగి రూ.15,093 కోట్లకు చేరగా, ఎబిట్డా 108 శాతం వృద్ధితో రూ.9,285 కోట్లకు మరియు నికర లాభం 142 శాతం వృద్ధితో రూ.6,412 కోట్లకు పెరిగాయి. ఈ త్రైమాసికంలో శుద్ధి చేసిన లోహ ఉత్పత్తి 264 కేటీ కాగా, వెండి ఉత్పత్తి 20 శాతం పెరిగి 173 టన్నులకు చేరింది. అలాగే గనుల నుంచి జింక్ ఉత్పత్తి వ్యయం టన్నుకు 703 డాలర్లకు తగ్గింది.

కీలక ఖనిజాల విస్తరణలో భాగంగా కర్ణాటకలోని గుండ్లుపేటలో అరుదైన భూ మూలకాల బ్లాక్‌కు సంబంధించి కంపెనీ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను పొందింది. అంతేకాకుండా విద్యుత్‌ వినియోగంలో పునరుత్పాదక ఇంధన వాటాను 27 శాతానికి పెంచుకోగా, జింక్‌ అల్లాయ్‌ ప్లాంట్‌ను పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌తోనే నడుపుతున్నారు. సంస్థ ఆస్తులు మరియు ఉద్యోగుల సామర్థ్యానికి ఈ రికార్డు ఉత్పత్తి నిదర్శనమని, ఏఐ ఆధారిత ఆవిష్కరణలు మరియు కీలక ఖనిజాల విస్తరణ ద్వారా వాటాదారులకు దీర్ఘకాలిక విలువను అందించడమే తమ లక్ష్యమని సీఈవో అమరేందు ప్రకాశ్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్