Magazines

హైదరాబాద్‌లో ఐడీబీఐ బ్యాంక్‌ వాకథాన్‌

1 గంట క్రితం

IDBI Bank Walkathon in Hyderabad
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌–2026లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌ హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయం ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో వాకథాన్‌ నిర్వహించారు. అవినీతి నిరోధం, పారదర్శకతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగులు విధి నిర్వహణలో నిజాయితీ, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ హెడ్‌ ఎం. జానకిరామన్‌ పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఉద్యోగులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో నిజాయితీ, నైతిక విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని, మంచి పాలన, నైతిక విధానాల పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్