Wednesday, October 22, 2025
E-PAPER
Homeక్రైమ్కారును ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు మృతి

కారును ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు మృతి

- Advertisement -

– మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
– కొండన్నపల్లి బస్టాండ్‌ వద్ద దుర్ఘటన
నవతెలంగాణ-గంగాధర

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని కొండన్నపల్లి గ్రామ బస్‌స్టేజీ వద్ద కారు, బైక్‌ ఢకొీనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు, గంగాధర్‌ ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర మండలంలోని కొండన్నపల్లి బస్‌ స్టేజి వద్ద మంగళవారం ఉదయం వేగంగా వచ్చిన బైక్‌ కారును వెనుక నుంచి ఢకొీట్టడంతో కారు అదుపుతప్పి చెట్టును గుద్దుకుంది. ఈ ఘటనలో కారును నడుపుతున్న తొర్రికొండ మల్లయ్య(55), బైక్‌పై వెళ్తున్న ఇమ్రాన్‌ షా(30) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మల్లయ్య భార్య విమల, అతని మేనత్త కనుకవ్వ స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -