నవతెలంగాణ – మోపాల్ : నిజామాబాద్ నాలుగో టౌన్ పరిధిలోని రోటరీ నగర్ నుండి రాత్రి సమయంలో నవీన్ అనే వ్యక్తి బైక్ దొంగిలించాడు. అదే రోజు రాత్రి మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామ శివారులోని ఒక గుడిలో, ముదక్పల్లి గ్రామంలో గల ఒక గుడిలో హుండీ నీ దొంగలించాడు. మళ్ళీ అదే గ్రామంలో గుడి పక్కన గల ఇంటి ఆవరణలో మరో బైక్ ని అపహరించాడు. నేరస్థుడు నవీన్(27) గతంలోనూ దొంగతనాలు చేసి పట్టుబడి, మూడేండ్ల జైలు జీవితం కూడా గడిపాడని తెలిసింది. విడుదలయ్యాక విలాసం కోసం మళ్లీ దొంగతనాలను చేస్తున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న ఎస్సై యాదగిరి గౌడ్, ఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ సామ్యూల్, నిజామాబాద్ ఉన్నత అధికారులు, సిఐ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
బైక్ దొంగ అరెస్టు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES