‘నారీ నారీ నడుమ మురారి’తో సంక్రాంతి బ్లాక్ బస్టర్‌ని అందుకున్న హీరో శర్వానంద్ తన అప్ కమింగ్ మూవీ ‘బైకర్’లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్, సాంగ్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ పోస్టర్‌లో శర్వా బైకర్ లుక్‌లో కనిపిస్తూ అలరిస్తున్నారు.
1990, 2000 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘బైకర్’ రేసింగ్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్‌షిప్స్‌తో మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన కథ అని చిత్రయూనిట్ తెలిపింది.
బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర, నిర్మాతలు: వంశీ-ప్రమోద్, సమర్పణ: విక్రమ్, సంగీతం: జిబ్రాన్, డీఓపీ: జీ యువరాజ్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, ఎడిటర్: అనిల్ కుమార్ పి, ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘బైకర్’
- Advertisement -
- Advertisement -



