Thursday, October 16, 2025
E-PAPER
Homeబీజినెస్ఎల్‌ఐసీ నుంచి బీమా లక్ష్మీ ప్లాన్‌

ఎల్‌ఐసీ నుంచి బీమా లక్ష్మీ ప్లాన్‌

- Advertisement -

– మరో పాలసీ జన సురక్ష ఆవిష్కరణ
ముంబయి :
దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ ఎల్‌ఐసీ కొత్తగా రెండు పాలసీలను విడుదల చేసింది. బీమా లక్ష్మీ, జన సురక్ష పేరుతో వీటిని ఆవిష్కరించింది. అక్టోబర్‌ 15 నుంచి ఈ రెండు పాలసీలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. వీటికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి మిగితా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. అందరికీ బీమా కల్పించాలన్న ఉద్దేశంతో తక్కువ ధరలో జన సురక్ష ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్టు ఎల్‌ఐసీ వెల్లడించింది. తక్కువ ప్రీమియం చెల్లింపులు కలిగిన దీనికి మార్కెట్‌ ఒడుదొడుకులతో సంబంధం లేదు. 12-20 ఏండ ్లకాలవ్యవధి కలిగిన ఈ ప్లాన్‌ను 18-55 ఏండ్ల వయసున్నవారు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. కనీస బీమా హామీ మొత్తం రూ.1లక్ష కాగా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఎంచుకోవచ్చు. పాలసీ కాలవ్యవధిలో పాలసీదారుడికి ఏదైనా జరిగినా హామీ మొత్తాన్ని సంస్థ చెల్లిస్తుంది. ఈ పాలసీపై రుణ సదుపాయాన్ని కూడా కల్పించింది.మహిళలకు బీమా సదుపాయం కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో బీమా లక్ష్మీ పాలసీని రూపొందించింది. ఇది కూడా మార్కెట్‌కు అనుసంధానమై ఉండదు. పాలసీ తీసుకోవడానికి 18 నుంచి 50 ఏళ్ల మహిళలు అర్హులు. కనీస బీమా హామీ మొత్తం రూ.2 లక్షలు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. ఏటా 7 శాతం చొప్పున ప్రీమియం చెల్లింపుపై గ్యారెంటీడ్‌ అడిషన్‌ను చెల్లిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో బీమా హామీ మొత్తం సహా గ్యారెంటీడ్‌ అడిషన్‌ను అందిస్తుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా బీమా హామీ మొత్తంలో ఏది ఎక్కువైతే దాన్ని చెల్లిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -