Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిన్ తిమ్మాపురం సమస్యలు పరిష్కరించాలి

బిన్ తిమ్మాపురం సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

ఎమ్మెల్యేని కోరిన సర్పంచ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలంలోని  బి ఎన్ తిమ్మాపురం గ్రామ ప్రజా సమస్యలు భూ నిర్వాసితుల సమస్యలు ఆర్ అండ్ ఆర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి  ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి, ఘనంగా సన్మానించి గ్రామ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ.. బి ఎన్ తిమ్మాపురం గ్రామ భూ నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే భూ నిర్వాసితులకు అవార్డులకు సంబంధించిన బడ్జెట్ అందజేస్తామని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆర్ఎన్ఆర్ కాలనీ యొక్క సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా పనులు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల పోరం అధ్యక్షులు పాశం శివానంద్,   సర్పంచులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -