Wednesday, April 30, 2025
Homeజిల్లాలు  మున్సిపల్ లో బయోమెట్రిక్ విధానం ..

  మున్సిపల్ లో బయోమెట్రిక్ విధానం ..

నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో  అధికారులు, సిబ్బంది హాజరు కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానం అమలవుతోందని మున్సిపల్ కమిషనర్ బట్టు శ్రీహరి రాజు తెలిపారు. బుధవారం  మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఒకరు ఒకరు వచ్చి బయోమెట్రిక్ వేసి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు మాట్లాడుతూ నిత్యం మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులుందరూ సకాలంలో వచ్చి బయోమెట్రిక్ ద్వారా హాజరు వేసుకోవాలని సూచించారు. ఈ బయోమెట్రిక్ విధానం అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  సిబ్బంది, జూనియర్ అకౌంటెంట్లు, వార్డ్ ఆఫీసర్లు, జూనియర్ సహాయకులు, మున్సిపల్ మెనేజర్ మల్లికార్జున్ రెడ్డి  తదితరులు ఉన్నారు. 

  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img