నివాళులు అర్పించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా జయంతి వేడుకలను గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం వేడుకలు నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, బిర్సా ముండా చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా అని కొనియాడారు. డీటీడబ్ల్యూఓ సంగీత, ఏఓ రాంరెడ్డి, డీఎం డబ్ల్యూఓ భారతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, ఎల్డీఎం మల్లికార్జున రావు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



