Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆధ్యాత్మికవేత్త, కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ జయంతి

ఆధ్యాత్మికవేత్త, కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌన్ 
కుల మతాలు లేవు పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదని, అఖిలభారత కళా ప్రముఖ, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం శ్రీ రామకృష్ణ విద్యాలయం వద్ద, తెలంగాణ ప్రాంత కళా ప్రముఖ, బండిరాజుల శంకర్ ఆధ్వర్యంలో గొప్ప ఆధ్యాత్మికవేత్త, కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ యొక్క జయంతిని పురస్కరించుకుని, ఆయన పోస్టర్ ఆవిష్కరణ సామాజిక సమరసత వేదిక, యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. కులమతాలు లేవని అందరూ సమానమేనని, చేసే కర్మల వల్ల మాత్రమే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. నని సంత్ రవిదాస్ బోధనలు విశిష్టత గురించి  వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత కళాప్రముఖ్ బండిరాజుల శంకర్, జిల్లా కన్వీనర్ పులమేని అంబేద్కర్, ఆలేరు మోచీ సంఘం అధ్యక్షులు బెదరకోట దుర్గేశ్, సభ్యులు చంద్రగిరి రమేశ్, చంద్రగిరి లింగం, అలిసేరి వెంకటేశ్, ఉపాధ్యాయులు తరిగొప్పుల రమేశ్, నారగోని భీమేశ్, బొడ్డు రమేశ్, జూకంటి సిద్ధులు, పిస్కె గణేశ్, పంతంగి శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -